ETV Bharat / city

CM KCR on Farmers Law: తెలంగాణ సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం.. వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం

వ్యవసాయ చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్​ అభినందనలు (CM KCR on Three Farmers Law ) తెలిపారు. పోరాటంలో అమరులైన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలన్న కేసీఆర్.. తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామన్నారు.

సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం... వారికి రూ.3 లక్షల ఆర్థికసాయం

author img

By

Published : Nov 20, 2021, 8:06 PM IST

సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు తెలంగాణ సీఎం కేసీఆర్​ అభినందనలు (CM KCR on Three Farmers Law ) తెలిపారు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు. రైతులపై పెట్టిన కేసులను కేంద్రం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు తెలిపిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టారని... అమాయకులపై పెట్టిన దేశద్రోహం కేసులు ఎత్తివేయాలని స్పష్టం చేశారు. రైతుల విషయంలో కేంద్ర చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. మంత్రులు, పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ మీడియాతో (CM KCR Press Meet) మాట్లాడారు.

'ఉద్యమ సమయంలో 700కు పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. అమరులైన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలి. అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తాం. రైతులకు సాయం కోసం రూ.22 కోట్లు కేటాయిస్తాం. కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి.'

- కేసీఆర్, సీఎం

పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మూడు డిమాండ్ల గురించి కేంద్రాన్ని అడుగుతాని తెలిపారు. కేంద్రానికి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషమని.. విద్యుత్ చట్టాల విషయంలో కూడా కేంద్రం వెనక్కి తగ్గాలన్నారు. నూతన విద్యుత్ చట్టాలతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని మాపై ఒత్తిడి చేయొద్దని స్పష్టం చేశారు. ఇష్టమున్న రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తాయని... విద్యుత్‌ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. విద్యుత్‌ చట్టం రద్దు చేసుకోకపోతే మరో ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. బోర్లకు మీటర్లు పెట్టాలనటం దుర్మార్గమైన చర్యన్నారు.

ఇదీ చదవండి : Aerial survey: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.