Atm Robbery in Kadapa: కడప నగరంలోని రెండు ఎస్బీఐ ఏటీఎంల్లో చోరీ జరిగింది. వాటిల్లో ఉన్న రూ. 41 లక్షల నగదును అపహరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం..
కడప శివారులోని రామాంజనేయపురం వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో 24 లక్షల రూపాయలను కాజేశారు. అత్యాధునికమైన కటింగ్ పరికరాలతో ఏటీఏంను బద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉన్న మరో ఎస్బీఐ ఏటీఏంలోనూ ఇదే తరహాలో డబ్బులు దొంగిలించారు. ఇక్కడ రూ. 17 లక్షలను కాజేశారు. రెండు ఏటీఎంలను ఓకే ముఠా కొల్లగొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నకిలీ సీబీఐ అధికారులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
Fake CBI Officers Gang Arrest At Kadapa: సీబీఐ అధికారులమంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని కడప పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు గుర్తింపుకార్డులను 84 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి.. తన కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. అనంతపురానికి చెందిన నాగేష్ నాయుడు, నెల్లూరుకు చెందిన సుందర రామయ్య, కడపకు చెందిన నవీన్ రాజ్, ప్రభాకర్ నాయక్ స్నేహితులు.. ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి సీబీఐ అధికారుల మంటూ ఫోన్ కాల్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉండేవారు. నవీన్ రాజుపై ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఖాజీపేట మండలం పత్తుర్ గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తికి నవీన్ రాజు ఫోన్ చేసి తాము సీబీఐ అధికారులమంటూ బెదిరించి అతనిని వాహనంలో తీసుకెళ్లి లక్ష 14 వేల రూపాయలు డబ్బులు తీసుకుని రోడ్డుపై దించేసి పారిపోయారు. ఉదయ్ కుమార్ చెన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ఈ నలుగురిని చెన్నూరు మండలం వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి ఒక వాహనంతోపాటు రూ. 84 వేల నగదు స్వాధీన చేసుకున్నాం' అని డీఎస్సీ వెంకటశివారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి
CM Jagan in SLBC Meeting: ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల చొప్పున రుణం ఇవ్వండి: సీఎం జగన్