అతివేగం రహదారులపై నెత్తుటేరులు పారిస్తోంది. ఏటా వేల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో 72.48 శాతం రోడ్డు ప్రమాదాలు, 82 శాతం ప్రమాద మరణాలు అతివేగం వల్లే జరుగుతున్నాయి. 2018లో జరిగిన రోడ్డుప్రమాదాల సమాచారాన్ని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 30.9 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2017తో పోలిస్తే 2018లో రోడ్డు ప్రమాదాలు, ప్రమాద మరణాల సంఖ్య తగ్గింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ప్రమాదాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా సగటున రోజుకు 1,279 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా.. రాష్ట్రంలో సగటున 67 ప్రమాదాలు జరిగాయి.
* ప్రమాదాల బారిన పడినవారిలో శిరస్త్రాణం ధరిస్తే 2,358 మంది, సీటుబెల్టు పెట్టుకుంటే 846 మంది ప్రాణాలు పోయేవి కావు.
* రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నవారిలో 42.89 శాతం మంది 18 నుంచి 35 సంవత్సరాలలోపువారు.. 24.78 శాతం మంది 35-45 ఏళ్ల వయసు వారే.
* ప్రమాదాలకు కారణమైన వాహనదారుల్లో 3,024 మంది లైసెన్సు లేకుండానే వాహనాలు నడిపారు.
* గ్రామాల్లోనే 69.51 శాతం ప్రమాదాలు, 76.25 శాతం ప్రమాద మరణాలు జరుగుతున్నాయి.
* రాష్ట్రంలో 2017తో పోలిస్తే 2018లో 4.9 శాతం ప్రమాదాలు, 6.3 శాతం ప్రమాద మరణాలు తగ్గాయి.
* ద్విచక్రవాహనాలు, ఆటోరిక్షాల వల్లే ఎక్కువ ప్రమాదాలు సంభవించాయి.
ప్రమాద కారణాలు
కారణం | ప్రమాదాలు | మృతులు | క్షతగాత్రులు |
అతివేగం | 17440 | 6196 | 847 |
మద్యం తాగి నడపడం | 1345 | 85 | 187 |
రాంగ్రూట్లో నడపడం | 740 | 192 | 847 |
ఎర్రలైటు పడినా ఆగకపోవడం | 48 | 01 | 49 |
సెల్ఫోన్ డ్రైవింగ్ | 82 | 07 | 70 |
ఇవీ చదవండి..