తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి భారీ మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ రాబోతుంది. బీరుట్లో ఘటన తర్వాత ఈ తరలింపు అంశంపై ప్రజల్లో భయం ఏర్పడింది. దీని గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదని పెట్రోలియం ఎక్స్ప్లోసివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ మాజీ అధికారి జీ.ఎం.రెడ్డి పేర్కొన్నారు.
బీరుట్లో జరిగిన ప్రమాదానికి.. రసాయనంతో వేరే పదార్థం కలిసి ఉండొచ్చని.. పోర్టుల్లో ఈ రసాయనాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచరాదని ఆయన తెలిపారు. గనులు, ఎరువుల తయరీ కంపెనీలు ఎక్కువగా వాడే ఈ రసాయనం కొనుగోలు, దిగుమతి నిరంతర ప్రక్రియ అంటున్న జీ.ఎం.రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: