ETV Bharat / city

24 వేల మెగావాట్లు ఏర్పాటైతే మరింత భారం: డిస్కంలు

author img

By

Published : Jul 27, 2021, 7:30 AM IST

రాష్ట్రంలో 2022 నాటికి 15వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటుచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాదికి 24 వేల మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం.ఇంత పెద్దమొత్తంలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు వస్తే గ్రిడ్‌ నిర్వహణ కష్టమని డిస్కంలు అంటున్నాయి.

Renewable electricity
Renewable electricity

రాష్ట్రంలో 2021-22 నాటికి 15 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటుచేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. రాష్ట్రంలో ఉన్న అవకాశాల దృష్ట్యా అదనంగా మరో 9 వేల మెగావాట్ల ప్రాజెక్టులను కేటాయించింది. అంటే వచ్చే ఏడాదికి 24 వేల మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇంత పెద్ద మొత్తంలో పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు వస్తే గ్రిడ్‌ నిర్వహణ కష్టమని డిస్కంలు అంటున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి, గ్రిడ్‌ భద్రత, ఇతర ఖర్చుల రూపేణా రూ.4 వేల కోట్ల అదనపు భారాన్ని మోస్తున్నట్లు డిస్కంలు పేర్కొన్నాయి.

ఈ భారం మరీ పెరగకుండా.. 7వేల మెగావాట్ల ప్రాజెక్టులనే రాష్ట్రంలో ఏర్పాటుచేసేలా చూడాలని ఏపీఈఆర్‌సీకి దాఖలు చేసిన పిటిషన్‌లో డిస్కంలు ప్రస్తావించాయి. కానీ, ప్రభుత్వం అదనంగా మరో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రతిపాదించింది. న్యాయపరమైన వివాదాల కారణంగా టెండర్లను కోర్టు రద్దుచేసింది. లేకుంటే కొత్త ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేవి. ఇదే జరిగితే గ్రిడ్‌ నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.15 వేల కోట్లను వెచ్చించాలని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు.

డిస్కంల అభ్యంతరాలు ఇవీ..

పునరుత్పాదక విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానించటం వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి ఏపీఈఆర్‌సీకి ఏపీ ట్రాన్స్‌కో గతంలో లేఖ రాసిందని డిస్కంలు తెలిపాయి. పునరుత్పాదక విద్యుత్‌ ఎక్కువగా అనుసంధానం చేయటం వల్ల తక్కువ గ్రిడ్‌ సామర్థ్యం ఉన్న రాష్ట్రాలు ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటున్నాయని కేంద్ర విద్యుత్‌ అథారిటీ(సీఈఏ) పేర్కొన్న విషయాన్ని డిస్కంలు ప్రస్తావించాయి.

* ఏపీ గ్రిడ్‌ వ్యవస్థ 5,300 నుంచి 10,170 మెగావాట్ల మధ్య పనిచేస్తోంది. వాతావరణ మార్పులతో అంచనాలు.. లభ్యతకు మధ్య వ్యత్యాసంతో రోజువారీ విద్యుత్‌ ప్రణాళికలో అకస్మాత్తుగా హెచ్చుతగ్గులు వస్తున్నాయి.

* సౌర, పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయక ముందు గ్రిడ్‌ నిర్వహణలో అనిశ్చితి చాలా తక్కువ.

* గ్రిడ్‌కు అవసరమైన విద్యుత్‌ను ఒకరోజు ముందుగా అంచనా వేసి ఉత్పత్తి ప్రతిపాదలను ఎస్‌ఎల్‌డీసీ అందిస్తుంది. పునరుత్పాదక విద్యుత్‌ యూనిట్ల నుంచి రోజువారీ ఉత్పత్తిలో 50 నుంచి 2వేల మెగావాట్ల హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

* స్వల్ప వ్యవధిలో గ్రిడ్‌ అవసరాల కోసం.. కొన్నిసార్లు డిమాండ్‌ సర్దుబాటు కోసం అధిక ధరకు కొనాల్సి వస్తోంది. అక్కడ లేకపోతే గ్రిడ్‌ కోడ్‌ను అతిక్రమించి అదనంగా తీసుకోవడం వల్ల రీజినల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) నుంచి వచ్చే నోటీసులకు ఎస్‌ఎల్‌డీసీ సమాధానం చెప్పాల్సి వస్తోంది.

* విద్యుత్‌ డిమాండ్‌ అంచనాల్లో హెచ్చుతగ్గులను 250 మెగావాట్ల వరకే కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ) అనుమతిస్తుంది. రాష్ట్రంలోని 7,500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల వల్ల విద్యుత్‌ అంచనాల్లో సుమారు 15%.. అంటే 1,125 మెగావాట్ల తేడా వస్తోంది.

* పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు సంప్రదాయ విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించి గ్రిడ్‌ నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఎస్‌ఎల్‌డీసీ వ్యవహరిస్తోంది. అదే ఉత్పత్తి తక్కువగా ఉంటే గ్రిడ్‌ నుంచి అదనంగా తీసుకుంటున్నాం. ఇలా గత రెండేళ్లుగా గ్రిడ్‌ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇదీ చదవండి:

POLAVARAM: 'చస్తేనే పరిహారం ఇస్తారా.. పోలవరం నిర్వాసితులను పట్టించుకోరా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.