స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. తొలి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 9 నుంచి 11వరకు నామినేషన్లు స్వీకరించి.. ఈనెల 12న నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 14వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 21న పోలింగ్ జరుగనుండగా.. ఈనెల 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు...
ప్రతి జిల్లాలో 2 విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 17 నుంచి 19 వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 20న తొలివిడత నామినేషన్ల పరిశీలన.. 22వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈనెల 27న తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ , అదే రోజు ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు.
మున్సిపల్ ఎన్నికలు
ఈనెల 9న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ.. 14న నామినేషన్ల పరిశీలన.. 16న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈనెల 23న పోలింగ్ నిర్వహించి.. 27న ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇవీ చదవండి...'నకిలీ ఓట్లకు చెక్ పెట్టేందుకే ఆధార్-ఓటర్ కార్డ్ లింక్'