Jubilee hills rape case: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో మైనర్ల బెయిల్ పిటిషన్‌ను జువైనల్ జస్టిస్ బోర్డు తిరస్కరించింది. బెయిల్ ఇవ్వొద్దన్న పోలీసుల వాదనతో జువైనల్ జస్టిస్ బోర్డు ఏకీభవించింది. రేపు మరో మైనర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈనెల 23న మరో మైనర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఐదుగురు మైనర్లతో పాటు మేజరైన సాదుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నలుగురు మైనర్లు జువైనల్ జస్టిస్ బోర్డులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై మంగళవారం నిందితుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే కేసు దర్యాప్తు దశలో ఉన్నందున మైనర్లకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసుల తరఫు న్యాయవాది బోర్డు ఎదుట వాదనలు వినిపించారు. సమాజంలో పలుకుబడి ఉన్న మైనర్ల తల్లిదండ్రులు దర్యాప్తునకు ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉండొచ్చని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారం విచారణ వాయిదా వేసిన జువైనల్ జస్టిస్ బోర్డు పిటిషన్లు తిరస్కరిస్తూ తీర్పు వెల్లడించింది.
ఇదీ చదవండి: