ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు - రిజిస్ట్రేషన్ సేవల్లో ఇబ్బందులు

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి. ఈనెల 13 నుంచే ఈ సమస్య ఉన్నా సంక్రాంతి సెలవుల వల్ల వెలుగులోకి రాలేదు. శుక్రవారం రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వెళ్లిన వారికి అనేక సమస్యలు ఎదురయ్యాయి.

Registration services across the state have stalled

author img

By

Published : Jan 17, 2020, 10:43 PM IST

రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ సేవలు శుక్రవారం నిలిచిపోయాయి. ఆధార్ వివరాలకు సంబంధించి.. ఏపీటీఎస్ సంస్థతో ఒప్పందం గడువు ఈ నెల 12తో ముగిసింది. కొత్త సంస్థతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నా ఆ ప్రక్రియ జరగలేదు. దీనివల్ల ఈ నెల 13 నుంచి రిజిస్ట్రేషన్ల సమయంలో ఆధార్ నమోదు చేయగానే ఈ- కేవైసీ సమస్య తలెత్తుతోంది. సంక్రాంతి పండగ సెలవుల అనంతరం శుక్రవారం రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వెళ్లిన వారికి అనేక సమస్యలు ఎదురయ్యాయి. కేవలం ఎన్నారైలకు మాత్రమే పాస్‌పోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కలిగింది. ఆయా జిల్లాల రిజిస్ట్రార్ల నుంచి ప్రభుత్వానికి ఈ- కేవైసీ సమస్యపై లేఖలు పంపినా పరిష్కారానికి నిర్ణయం వెలువడలేదు.

ఇదీ చదవండి:'ఈ నెల 20 వరకు అభ్యంతరాలు తీసుకోండి- సీఆర్డీఏకు హైకోర్టు ఆదేశం '

Intro:Body:

This test message. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.