ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ఆదరణ పొందుతోందని అన్నారు. భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో నూతన శకం ఆరంభమైనట్టుగా ప్రజలు భావిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ధరణి ద్వారా వ్యవసాయ భూములకు భరోసా దొరికిందని హర్షిస్తున్నారని పేర్కొన్నారు.
మరో 3, 4 రోజుల్లో అన్ని సమస్యలను ధరణి అధిగమిస్తుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.
ఇవీచూడండి: