హైదరాబాద్‌లో గంటసేపు వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా సాయంత్రం వాతావరణం మారిపోయింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మేఘాలకు చిల్లు పడిందా అనే రితీలో వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షంతో హైదరాబాద్ నగరం అతలకుతలం అయింది. వాహనదారులు, ప్రయాణికులు, నగరవాసులు అందరూ... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భాగ్యలత, పనామా, హయత్‌నగర్ రోడ్లపై భారీగా వాన నీరు చేరింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది... వాహనాలను మళ్లీంచారు.
భాగ్యనగరంలో కురిసిన వర్షపాతం వివరాలిలా...
ప్రాంతం | వర్షపాతం |
నేరేడ్‌మెట్ | 9.5 సెం.మీ |
ఆనందబాగ్ | 7.3సెం.మీ |
మల్కాజ్‌గిరి | 6.7సెం.మీ |
తిరుమలగిరి | 6.3సెం.మీ |
హయత్‌నగర్ | 6.2సెం.మీ |
కుషాయిగూడ | 5.9సెం.మీ |
భగత్‌సింగ్‌నగర్ | 5.5సెం.మీ |
వెస్ట్ మారేడుపల్లి | 5.3సెం.మీ |
బేగంపేట | 5సెం.మీ |
ఇదీ చూడండి: