ETV Bharat / city

'సమగ్ర డీపీఆర్ ఉండదు.. ప్రాజెక్టు వివరాలు మాత్రమే సమర్పించాం' - రాయలసీమ ఎత్తిపోతల పథకం అప్​డేట్

ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, కర్నూలు చీఫ్ ఇంజినీర్ హైదరాబాద్​లోకృష్ణా బోర్డు సభ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వివవరాలను సమర్పించారు.

rayalaseema lift irrigation project
రాయలసీమ ఎత్తిపోతల పథకం
author img

By

Published : Jan 5, 2021, 8:30 AM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదనీ.. విభజన చట్టం ప్రకారం దీనిని చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, కర్నూలు చీఫ్ ఇంజినీర్ మురళీనాథ్​రెడ్డి కృష్ణా బోర్డుకు తెలియజేశారు. ఈ ఎత్తిపోతలకు కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకుంటే సరిపోతుందని కేంద్ర జలసంఘం తేల్చి చెప్పిన సందర్భంగా.. వీరిద్దరూ సోమవారం హైరాబాద్​లో బోర్డు ఛైర్మన్ పరమేశంతోనూ కలవాలనుకున్నారు. ఛైర్మన్ అందుబాటులో లేకపోవటంతో సభ్య కార్యదర్శులు రాయపురి, మీనాలను కలిసి అన్ని విషయాలను వివరించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్తది కానందున సమగ్ర డీపీఆర్ ఉండదనీ.. ప్రాజెక్టు వివరాలు మాత్రమే సమర్పించామన్నారు. బోర్డు సభ్య కార్యదర్శులు వీటిపై సాంకేతికంగా అనేక సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తారు. ఒకేసారి ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా నీరు తీసుకుంటారా అని ప్రశ్నించారు. దీనిపై..'అలా తీసుకునే అవకాశం లేదు. కేవలం శ్రీశైలం జలాశయం 800 నుంచి 854 అడుగుల నీటిమట్టం వద్ద మాత్రమే నీటిని ఎత్తిపోతలతో తీసుకుంటా. ప్రతీ చుక్కకు పక్కా లెక్క ఉంటుంది. కేవలం మా వాటా నీటిని తీసుకునేందుకు మాత్రమే ఈ కొత్త ఏర్పాటు చేసుకుంటున్నా...' అని ఈఎన్​సీ, చీఫ్ ఇంజినీరు వివరించారు.

అందుకే బోర్డు కార్యాలయం విశాఖలో..

ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ప్రధాన కార్యలయాలన్నీ కూడా త్వరలో విశాఖలో ఏర్పాటు చేయబోతున్నామనీ.. అందువల్లే కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈఎన్​సీ నారాయణరెడ్డి బోర్డు సభ్య కార్యదర్శులకు తెలియజేశారు.

ఇదీ చదవండి: నేడు భాజపా, జనసేన రామతీర్థ ధర్మయాత్ర.. నేతల గృహ నిర్బంధాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.