తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి చెరువులో లింగాపూర్‌కు చెందిన పలువురు మత్స్యకారులు చేపల కోసం వలలు వేశారు. ఈ క్రమంలోనే ఓ మత్స్యకారుని వలలో బంగారు వర్ణంలో ఉన్న చేప చిక్కింది. దీని బరువు సుమారు 5 కిలోల వరకు ఉన్నట్లు మత్స్యకారుడు తెలిపాడు.
చేప పూర్తిగా బంగారు వర్ణంలో ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి చేపలు అరుదుగా కనిపిస్తాయని మత్స్యకారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ వాదన అనుమానాస్పదంగా ఉంది: షబ్బీర్ అలీ