ETV Bharat / city

భాజపా వల్లే ముస్లింలకు న్యాయం: రాజా సింగ్​ - ఎమ్మెల్యే రాజా సింగ్​

ముస్లింలకు న్యాయం జరగాలంటే ఒక్క భాజపా వల్లనే సాధ్యమవుతుందని తెలంగాణలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ అన్నారు. ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తన కుటుంబ సభ్యుడు చనిపోవడంతో రాజాసింగ్.. ఎన్నికల ప్రచారానికి వెళ్లలేకపోయారు.

raja-singh
raja-singhraja-singh
author img

By

Published : Nov 24, 2020, 8:52 PM IST

ముస్లింలకు న్యాయం జరగాలంటే ఒక్క భాజపా వల్లనే సాధ్యమవుతుందని తెలంగాణలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ముస్లిం వర్గాన్ని అభివృద్ధి చేయడంలో తెరాస విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హిందూ- ముస్లిం విద్వేషాలు ఒవైసీ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

భాజపా వల్లే ముస్లింలకు న్యాయం: రాజా సింగ్​

అసదుద్దీన్‌ మాదిరిగా భాజపా తప్పుడు ప్రచారం చేయదని రాజాసింగ్​ స్పష్టం చేశారు. పాతబస్తీలో వరదలతో నష్టపోయిన ఏ ఒక్క ముస్లిం కూడా జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఆయనకి ఓటు వేయరని అసదుద్దీన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన అల్లుడు చనిపోవడంతో ఎన్నికల ప్రచారానికి వెళ్లడంలేదని తెలిపారు.

ఇదీ చదవండి:

'పారిశ్రామిక వేత్తలకు చేయూతనిచ్చే ప్రభుత్వానికే మా మద్దతు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.