తెలంగాణలో.. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రి వరదనీటితో నిండిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి ఆస్పత్రిలోకి వరద నీరు చేరింది. రోగులు, వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
వర్షపు నీటితోపాటు మురుగునీరు కూడా రోగులుండే చోటకు ముంచెత్తడంతో ఆస్పత్రి పరిసరాలన్నీ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఆస్పత్రి ఆవరణలోని సామగ్రి వరదనీటిలో కొట్టుకుపోయింది. అసలే శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి వర్షం ధాటికి ఎక్కడ కూలిపోతుందోనని రోగులు, డాక్టర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:
కరోనా విధుల్లో ఉంటూ.. ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి పవన్ శ్రద్ధాంజలి