తెలంగాణలో వర్షాలు జోరందుకుంటున్నాయి. రాజధాని హైదరాబాద్ (Hyderabad rains)లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. మియాపూర్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌పుర్, మలక్‌పేట, వనస్థలిపురంలో జల్లులు(Rain falls) పడుతున్నాయి.
ఖమ్మంలో కూడా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచే వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రఘునాథపాలెం మండలం కూసుమంచి ఖమ్మం గ్రామీణం కొనిజర్ల చింతకాని మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
రేపు కూడా వర్షాలు
బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాల వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రాంతం నుంచి తెలంగాణ, కర్ణాటకల మీదుగా అరేబియా సముద్రం వరకూ ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావారణశాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు పడవచ్చని, గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.
ఇదీ చదవండి: