ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు తెలిపింది. రాగల మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి