ETV Bharat / city

"ప్రియా ఫుడ్స్‌ "ని మరోసారి వరించిన "ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్".. ప్రకటించిన 'ఫియో' - ప్రియా ఫుడ్స్‌కు ఎక్స్‌పోర్టు ఎక్స్‌లెన్స్ అవార్డు

FIEO Award For Priya Foods : నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందిస్తున్న ప్రియా ఫుడ్స్‌ మరోసారి ప్రతిష్ఠాత్మక ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకుంది. నాణ్యమైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులతో దేశానికి విదేశీ మారక ద్రవ్యం వచ్చేందుకు విశేష కృషి చేస్తున్నందుకు ప్రియా ఫుడ్స్‌కు ఈ పురస్కారం ఇస్తున్నట్లు ఎగుమతి సంఘాల సమాఖ్య(ఫియో) ప్రకటించింది. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రియా ఫుడ్స్ సీనియర్ మేనేజర్ వీరమాచినేని కృష్ణచంద్ అందుకున్నారు.

FIEO Award For Priya Foods
"ప్రియా ఫుడ్స్‌ "ని మరోసారి వరించిన "ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్"... ప్రకటించిన 'ఫియో'
author img

By

Published : May 11, 2022, 2:57 PM IST

"ప్రియా ఫుడ్స్‌ "ని మరోసారి వరించిన "ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్"... ప్రకటించిన 'ఫియో'

FIEO Award For Priya Foods : నాణ్యమైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులతో దేశానికి విదేశీ మారక ద్రవ్యం వచ్చేందుకు విశేష కృషి చేస్తున్న ‘ప్రియా ఫుడ్స్‌’కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక ‘ఎక్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ను ఆ సంస్థకు ఇస్తున్నట్లు భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఫియో) ప్రకటించింది. ఈ సంస్థకు ఈ కేటగిరీలో పురస్కారం లభించడం ఇది ఐదోసారి.

చెన్నైలో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ప్రియా ఫుడ్స్‌ సీనియర్ మేనేజర్ వీరమాచినేని కృష్ణచంద్‌కు ఈ పురస్కారాన్ని అందించారు. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యుత్తమ ఎగుమతిదారుగా ఉన్న ప్రియా ఫుడ్స్‌ సంస్థ.. 2017-18 సంవత్సరానికిగానూ ‘టాప్‌ వన్‌ స్టార్‌ ఎక్స్‌పోర్ట్‌ హౌస్‌ ఇన్‌ సదరన్‌ రీజియన్‌’ కేటగిరీలో అవార్డును దక్కించుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

పచ్చళ్లు, సంప్రదాయ పొడులు, చట్నీలు, సోనామసూరి రైస్, రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ వంటి 200కు పైగా ఉత్పత్తులు 40కి పైగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఆ దేశాలన్నీ ప్రియ ఉత్పత్తుల నాణ్యతతో చాలా సంతృప్తి చెందాయి. నాణ్యత కలిగిన ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నందుకు ఫియో నుంచి ఈ అవార్డు పొందడం ఇది ఐదో సారి. ఇలాంటి మరెన్నో పురస్కారాలు గెలుస్తామనే ధీమా ఉంది. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది.

- వీరమాచినేని కృష్ణచంద్, ప్రియా ఫుడ్స్ సీనియర్ మేనేజర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.