ETV Bharat / city

కరోనా కల్లోలం... ఇంకా తేరుకోలేకపోతున్న 'ప్రైవేటు' బతుకులు - corona effect on private teachers news

కరోనా సృష్టించిన కల్లోలంలో ఎన్నో జీవితాలు కుదేలయ్యాయి. అందులో ప్రైవేటు పాఠశాల టీచర్లు ఒకరు. పాఠశాలలు పునఃప్రారంభమైనా.. వారిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సగం జీతాలతోనే జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయి... బతుకు భారమై.. కుటుంబాన్ని పోషించలేక ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీ చాలని జీతాలతో బతుకుబండిని ఈడ్చలేక.. బోధనకు స్వస్తి చెప్పి.. కూలి పనులకు సైతం వెళ్తున్నారు.

private teachers struggles
ప్రైవేటు ఉపాధ్యాయుల వెతలు
author img

By

Published : Mar 11, 2021, 8:35 AM IST

రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమైనా ప్రైవేటు ఉపాధ్యాయులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. బడుల యాజమాన్యాలు వేతనాలు సరిగా ఇవ్వకపోవడంతో చాలా మంది బోధన వృత్తికే దూరం అవుతున్నారు. బయట కూడా ఉపాధి దొరక్క కొందరు అరకొర వేతనాలతోనే బడులు, కళాశాలల్లో పని చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది మాత్రం చిరు వ్యాపారాలు, మార్కెటింగ్‌ ఉద్యోగాలు, కుల వృత్తులు చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ ముందు వరకు రాష్ట్రంలో ప్రైవేటు బడులు, కళాశాలల్లో పని చేసిన వారు 5లక్షల వరకు ఉంటే.. వీరిలో 30శాతం నుంచి 35శాతం మంది ఉపాధ్యాయులు బోధనకు దూరమయ్యారు.

అనంతపురం జిల్లా కన్నెకల్లు మండలం పులిచర్లకు చెందిన గురుప్రసాద్‌ కార్పొరేట్‌ పాఠశాలలో హిందీ బోధించే వారు. కరోనాకు ముందు వరకు రూ.10వేలు వేతనం ఇవ్వగా.. ఇప్పుడు సగం మాత్రమే ఇస్తామని చెప్పడంతో కుటుంబ పోషణకు ఆ మొత్తం సరిపోక వ్యవసాయం చేస్తున్నారు. తనకు ఉన్న రెండెకరాలు సాగు చేస్తూ.. ఖాళీ సమయంలో కూలీ పనులకు వెళ్తున్నారు. ఉరవకొండకు చెందిన అనిల్‌కుమార్‌ కూడా ఈ పరిస్థితుల్లోనే చేనేత కార్మికుడిగా మారిపోయారు.

వేతనాలు చెల్లింపులు ఎన్నో రకాలు..

ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయులకు వేతన చెల్లింపుల్లో భారీ కోతలు పెట్టాయి. గంటల వారీగా కొన్ని, తరగతుల చొప్పున, సగం వేతనం ఇచ్చేలా, లేక సబ్జెక్టుకు ఇంత అని ఏది తక్కువైతే అలానే చెల్లించేలా చూస్తున్నాయి. కొన్ని విద్యా సంస్థల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులను తగ్గించేశాయి. గతంలో ఒక సబ్జెక్టుకు ఇద్దరు, ముగ్గురు ఉండగా.. ఇప్పుడు ఒక్కరితోనే చెప్పిస్తున్నాయి. వారికీ పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించలేని పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన వీరభద్రకు ఓ పాఠశాల లాక్‌డౌన్‌ ముందు వరకు రూ.12వేలు వేతనం ఇవ్వగా.. ప్రస్తుతం రూ.6వేలు చెల్లిస్తోంది. ప్రాథమిక పాఠశాలలను తెరిచినా చాలాచోట్ల విద్యార్థులు సక్రమంగా రావడం లేదని ఉపాధ్యాయులను తగ్గించేశాయి. ఆన్‌లైన్‌ విద్యను కొనసాగిస్తున్న బడులు, కళాశాలలు ఒక్కటి, రెండు జిల్లాలకు కలిపి ఒకే చోట నుంచి పాఠాలు బోధిస్తున్నాయి. అదే లింకును విద్యార్థులకు పంపిస్తున్నాయి.

నెలలో 26గంటలు పనిచేస్తే..వేతనం రూ.వెయ్యి

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నెలకు 26గంటలు పని చేస్తే రూ.వెయ్యి ఇస్తున్నారు. అదీనూ సబ్జెక్టుల ప్రాధాన్యం ప్రకారం ఆ ఉపాధ్యాయుడికి సమయం కేటాయిస్తున్నారు. గణితం, భౌతికశాస్త్రం చెప్పే వారికి కాస్త ఎక్కువ గంటలు పని దొరికే అవకాశం ఉన్నా.. మిగతా సబ్జెక్టులకు ఆ వీలు కల్పించడం లేదు. ఒక ఉపాధ్యాయుడు మూడు గంటలు పాఠశాలలో పని చేస్తే వేతనం రూ.3వేలు మాత్రమే. గతంలో రూ.15వేల వరకు వేతనం అందుకున్న వారికి ఇప్పుడు రూ.7 వేలూ రావడం లేదు.

కర్ర పనే కొలువు

private teachers struggles
కర్ర పని చేసుకుంటున్న మల్లికార్జున

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన ఈయన మల్లికార్జున. లాక్‌డౌన్‌ ముందు వరకు ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేశారు. ప్రస్తుతం బడులు తెరిచినా పిల్లలకు ఆటలు లేకపోవడంతో పాఠశాల యాజమాన్యం సగం వేతనమే ఇస్తామని చెప్పింది. ఆ తక్కువ మొత్తంతో కుటుంబం గడవడం కష్టమని భావించారు. కుల వృత్తి అయిన వడ్రంగి పని చేపట్టారు. వారసత్వంగా వచ్చిన పనిని నేర్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఉపాధ్యాయ వృత్తి నుంచి.. మార్కెటింగ్ లోకి..

private teachers struggles
మార్కెటింగ్​ ఉద్యోగం చేసుకుంటున్న రాంబాబు

ఇతని పేరు రాంబాబు. గుంటూరుకు చెందిన ఈయన కరోనాకు ముందు రెండు ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేశారు. కరోనా వ్యాప్తి వల్ల పాఠశాలలు మూతపడడం, ఉపాధి లేకపోవడంతో ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్‌ జాబ్‌లో చేరిపోయారు. గత జూన్‌ నుంచి ఇదే కొనసాగిస్తున్నారు. ఈయన తనకు ఎంతో ఇష్టమైన బోధనకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆ రంగంలోకి వెళ్దామన్నా వేతనం సగం కూడా ఇచ్చేందుకు పాఠశాలలు ఆసక్తి చూపడం లేదు.

ఆవులు మేపుతూ.. ఉపాధి పొందుతూ..

private teachers struggles
పశు పోషణలో నిమగ్నమైన శ్రీరామ్‌ కిరణ్

పశ్చిమగోదావరి జిల్లా తణుకు చెందిన శ్రీరామ్‌ కిరణ్‌ లాక్‌డౌన్‌ ముందు వరకు ప్రైవేటు కళాశాలలో పని చేసేవారు నెలకు రూ.15వేలు వేతనం వచ్చేది. ప్రస్తుతం ఆ కళాశాల ఒకటి, రెండు తరగతులు చెప్పించుకుని రూ.3వేలు ఇస్తుండటంతో కుటుంబ పోషణకు ఆవులను మేపుతున్నారు. మొదట్లో గోశాల నుంచి ఒక ఆవును తీసుకున్న ఆయన వేతనం సరిపోకపోవడంతో పూర్తిగా డెయిరీ పెట్టాలని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

కేంద్ర మంత్రి సమాధానంతో.. బయటపడిన బడ్జెట్ బండారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.