ETV Bharat / city

Pooja at dead body: 'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'! - జగిత్యాల జిల్లా తాజా వార్తలు

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో శవం వద్ద పూజలు నిర్వహించటం స్థానింకంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవగారానికి తరలించి..పూజలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.
'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.
author img

By

Published : Aug 13, 2021, 6:27 PM IST

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో శవం వద్ద పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. టీఆర్​నగర్‌లో రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. మంత్రాలు చేసి చంపాడని పుల్లయ్య అనే వ్యక్తిని మృతుడి కుటుంబ సభ్యులు చితకబాదారు. తానే మంత్రాలతో చంపానని, మళ్లీ బతికిస్తానని పుల్లయ్య అంగీకరించాడు. మృతదేహం వద్ద కొన్ని గంటలపాటు పూజలు చేశాడు.

ఈ విషయం ఆ నోట ఈ నోట పోలీసులకు చేరింది. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పుల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. పుల్లయ్యను పోలీసులు తీసుకెళ్లటంతో మృతుని బంధువుల ధర్నాకు దిగారు. దీంతో కరీంనగర్ - జగిత్యాల రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

ఇదీ చదవండి:

murder: పాతకక్షలతో పొడిచి.. పొడిచి.. చంపారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.