బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అఖిలప్రియకు సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేశారు. అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్ కోర్టు నివేదిక కోరటంతో ఆమెకు ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు.
పరీక్షల అనంతరం ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అఖిలప్రియ ఆరోగ్యంపై ఆమె చెల్లెలు మౌనిక ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'అమాయకులను కేసుల్లో ఇరికించి... హింసించవద్దు'