Woman Harassment in Khammam : తెలంగాణలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహితను వెంబడించి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో ఏడుగురిపై శుక్రవారం కేసు నమోదైంది. హైదరాబాద్ నుంచి పుట్టింటికి వెళ్లేందుకు భర్త, 14నెలల కుమారునితో కలిసి ఆమె ఖమ్మంలో గురువారం తెల్లవారుజామున బస్సు దిగారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న సోదరుడితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా కొందరు ఆకతాయిలు అడ్డగించారు. బాధితురాలిపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఆమెను తమకు వదిలేసి వెళ్లాలంటూ సోదరుడు, భర్తను బెదిరించారు.
వారి నుంచి తప్పించుకుని స్వగ్రామానికి వెళ్లిన వెంటనే గ్రామస్థుల సహకారంతో నిందితులను గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నగరంలోని ఎన్నెస్టీ రోడ్డుకు చెందిన ఏడుగురి(వీరిలో ముగ్గురు మైనర్లు)తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి :
Jubilee hills Gang Rape Case: సూత్రధారి కార్పొరేటర్ కుమారుడే
విజయవాడ రైల్వేస్టేషన్లో మూడేళ్ల పాప అపహరణ
జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితులు అరెస్టు