ETV Bharat / city

పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టుకు ఎల్‌వోఏ జారీ - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఎల్‌వోఏ ను ఏపీ జెన్‌కో జారీ చేసింది. ఎంఈఐఎల్‌తో ఏపీ జెన్‌కో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2025 నవంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలి. దీని నిర్మాణం పూర్తయితే 960 మెగావాట్ల జల విద్యుత్‌ అందుబాటులోకి రానుంది.

polavaram project
polavaram project
author img

By

Published : Apr 5, 2021, 8:14 AM IST

పోలవరం జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌వోఏ)ను ఏపీ జెన్‌కో జారీ చేసింది. గుత్తేదారు సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌)తో ఏపీ జెన్‌కో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 2025 నవంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఇందుకోసం రూ.3,216 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ జెన్‌కో ప్రతిపాదనలను రూపొందించింది. రివర్స్‌ టెండరింగ్‌లో రూ.2,810 కోట్లతో (12.6 శాతం తక్కువకు) పనులు చేపట్టడానికి గుత్తేదారు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీని నిర్మాణం పూర్తయితే 960 మెగావాట్ల జల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని జెన్‌కో అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: అవినీతి చేయకూడదనే సినిమాల్లో నటిస్తున్నా : పవర్ స్టార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.