ప్రభుత్వ భూముల అమ్మకాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. సామాజిక కార్యకర్త సురేశ్ దీనిపై వ్యాజ్యం దాఖలు చేశారు. మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతుందని.. వాటిలో దాతలు ఇచ్చినవీ ఉన్నాయని దానిలో పేర్కొన్నారు. వాటిని సైతం విక్రయించడం సరికాదని పిటిషనర్ తరుపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం తరుఫున న్యాయవాది దీనిపై వివరణ ఇచ్చేందుకు సమయం కోరారు. మంగళవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం