పోలవరం ముంపు గ్రామాల్లో నివాసం లేరని.. ప్యాకేజీ నిరాకరణ చట్ట విరుద్ధం - హైకోర్టు
HIGH COURT: ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిరాకరణపై పోలవరానికి చెందిన జ్యోతి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. పోలవరం ముంపు గ్రామాల్లో నివాసం లేరని ప్యాకేజీని నిరాకరించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది
HIGH COURT: తనకు రావలసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని రెవెన్యూ అధికారులు నిరాకరించారని పోలవరానికి చెందిన మాదే జ్యోతి అనే మహిళ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. పోలవరం ముంపు గ్రామాల ప్రజలు కేవలం అక్కడ నివాసముండుట లేదన్న కారణంతో ప్యాకేజీ నిరాకరించటం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. కేవలం రాజకీయ ప్రయోజనాలతో కొన్ని వందల మంది నిరుపేద నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పిటిషనర్‌కి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించవలసిందిగా అధికారులను హైకోర్టు ఆదేశించింది.
ఇవీ చదవండి: