రాష్ట్ర ఎన్నికల సంఘంపై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కాదు.. ఎన్నికల సంఘానికి కరోనా వైరస్ సోకిందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికలను కావాలనే వాయిదా వేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే ఈ చర్యలని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయితే కేంద్రం నుంచి రూ.4 వేల కోట్లు వచ్చేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని కావాలనే హడావిడి చేస్తున్నారన్న ఆయన... తెదేపా హయాంలో ఏకగ్రీవాలు జరగలేదా? అని ప్రశ్నించారు. ఒక్క కరోనా కేసు పేరుతో ఎన్నికలు వాయిదా వేయటం కుట్రపూరితమని చెప్పారు. వైకాపా అభ్యర్థులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిపివేత