ETV Bharat / city

రెండో డోసు టీకా... నిరీక్షణ తప్పేట్లు లేదుగా! - ఏపీ కరోనా వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ మొదటి డోసు టీకా తీసుకున్న వారు రెండో డోసు కోసం నిరీక్షిస్తున్నారు. రోజులు గడుస్తున్నాకొద్దీ వారికి వ్యాక్సిన్ అందడం లేదు. రెండు డోసు వేస్తారని సమాచారం వస్తుండడంతో వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల ఇంకా టీకాలు రాలేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.

state wise sencon dose covid vaccine
రాష్ట్ర వ్యాప్తంగా రెండో డోసు టీకా
author img

By

Published : May 7, 2021, 5:28 PM IST

కర్నూలు జిల్లాలో..

కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. తొలి డోసు వేయించుకుని చాలా రోజులు గడుస్తున్నా.. వారికి రెండో డోసు వ్యాక్సిన్ అందట్లేదు. కర్నూలు జిల్లాలో టీకా కోసం జనాలు బారులు తీరారు. ఉదయం నుంచి వ్యాక్సిన్ కోసం ఎదురుచుశారు. ఆత్మకూరులోని ఆరోగ్య కేంద్రం వద్ద ఇదే తరహాలో నిరీక్షించారు. వ్యాక్సిన్ ఇంకా రాలేదని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు.

తుర్పుగోదావరి జిల్లాలో..

కొత్తపేట నియోజకవర్గంలో అధికారులు వ్యాక్సినేషన్​కు ఇబ్బంది లేకుండా కేంద్రాలను ఏర్పాటు చేసి వృద్ధులకు టీకా వేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రావులపాలం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 60 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే అధికారులు వ్యాక్సిన్ వేశారు.

ప్రకాశం జిల్లాలో...

కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రజలు వాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టీకా వేయించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. ఉదయం నుండే వాక్సిన్ కోసం వేచి ఉంటున్నారు. ఎక్కువ మంది గుమిగూడితే కొవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదముందని టీకా కోసం వచ్చిన వారు ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖలో....

అనకాపల్లిలోని ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి తెదేపా అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు మళ్ల సురేంద్ర శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వేళ వైద్యులందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

ఇదీ చదవండి:

త్వరలోనే జగన్ దిల్లీ పెద్దలను కలిసే అవకాశం: ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.