viral video : ప్రకృతిని చూసి పరవశించింది.. పురి విప్పి నెమలి నాట్యమాడింది..! - peacock dance at sangareddy fruit research centre
viral video : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో భానుడి భగభగలు తగ్గాయి. పగలంతా ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. వర్షాలతో కొమ్మలు చిగురిస్తున్నాయి. పరిసరాలు పచ్చగా మారడంతో ఆహ్లాదకరంగా మారాయి. దీనికి తోడు చల్లని పిల్లగాలులు వీస్తుండటంతో మయూరాలు పులకరించి పోయాయి. పురివిప్పి వయ్యారాలు పోతూ నృత్యం చేసి ప్రకృతికి కొత్త అందాలు తెచ్చాయి. తెలంగాణ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫల పరిశోధన కేంద్రంలో నెమళ్లు చేసిన నృత్యం.. చూపరులకు ఆహ్లాదాన్ని పంచింది.
peacock video