విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాష్ట్రంలో పాదయాత్రలు, దిల్లీలో పాదపూజలు చేయడం ద్వారా ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోలేమని పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. రాష్ట్రంలోని ఎంపీలు మొత్తం ఏకతాటిపై వచ్చి... కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై పోరాడితే తప్ప మన హక్కుని మనం కాపాడుకోలేమని చెప్పారు. విశాఖ ఉక్కు వంద శాతం అమ్మేస్తామని కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటించడం దుర్మార్గమని విమర్శించారు.
విశాఖ ఉక్కుపై రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడం అన్యాయమన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ప్రజల ఆందోళన పట్టించుకోక పోవడం దారుణమని మండిపడ్డారు. అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభంప జేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రుల హక్కును ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ నిర్ణయం చారిత్రక తప్పిదం అవుతుందన్నారు.
ఇదీ చదవండి: చిత్తశుద్ధి ఉంటే వైకాపా ఎంపీలంతా రాజీనామాలు చేయాలి: అచ్నెన్న