ఆర్టీసీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన వారి కోసం వేతన సవరణ సంఘం కాల పరిమితిని మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాలు, అలవెన్సులు, పెన్షన్ తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు గానూ అశుతోష్ మిశ్రా నేతృత్వంలో పీఆర్సీని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సంఘం కాలపరిమితి జనవరి 31వ తేదీతో ముగిసింది. ప్రజా రవాణా విభాగం ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ నివేదిక రూపొందించేందుకు 11వ వేతన సవరణ సంఘం కాలపరిమితిని మార్చి 31వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి :