జగన్ సర్కారుపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ వేదికగా వైకాపా ప్రభుత్వంపై వాగ్భాణాలు సంధించిన జనసేనాని.. తాజాగా.. మరో ట్వీట్ (PAWANKALYAN ON TWITTER) చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వైకాపా పాలన లక్ష్యంగా పవన్ విమర్శనాస్త్రాలు సంధించారు.
-
ఎన్ని వాగ్దానాలు చేసినా
— Pawan Kalyan (@PawanKalyan) October 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా
'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9
">ఎన్ని వాగ్దానాలు చేసినా
— Pawan Kalyan (@PawanKalyan) October 8, 2021
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా
'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9ఎన్ని వాగ్దానాలు చేసినా
— Pawan Kalyan (@PawanKalyan) October 8, 2021
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా
'సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు'
ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9
"తాకట్టులో ఆంధ్రప్రదేశ్" పేరుతో (PAWANKALYAN ON TWITTER) ఒక ఛార్ట్ ను పోస్టు చేశారు పవన్. విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను, చెత్త పన్ను వగైరా.. పన్నులను నవరత్నాలతో పోల్చిన జనసేనాని.. భావి తరాలకు మిగిలేది అప్పులేనని అన్నారు. కొందరికి మాత్రమే నవరత్నాలు ఇస్తున్నారని.. పన్నులు మాత్రం అందరి నుంచీ భారీగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా హయాంలో ఆర్థిక వృద్ధి అథఃపాతాళానికి చేరిందని ఎద్దేవా చేశారు.
"ఎన్ని వాగ్ధానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా.. రాష్ట్ర బడ్జెట్ ను ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా.. సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు. ఈ మౌలిక ఆర్థిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది." అని పోస్టులో రాసుకొచ్చారు.
ఇదీ చూడండి: Thirumala Brahmotsavalu: చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు