PAWAN ON TEACHERS DAY : ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం.. రాష్ట్రంలో కళావిహీనంగా మారడం బాధ కలిగిస్తోందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వం పెడుతున్న మానసిక క్షోభ, హింసకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఈ వేడుకలు బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం వారు ఎంతగా నలిగిపోతున్నారో తెలియజేస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు. జ్ఞానాన్ని పంచే గురువులను వేధించిన వారందరూ.. చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. ఈ కబోది ప్రభుత్వానికి కళ్లు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అన్నారు. ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ఒక దేశం, ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని.. ఉపాధ్యాయ దినోత్సవం వేళ విజ్ఞాన ప్రదాతలైన గురువులకు ప్రణామాలు అర్పిస్తున్నానని చెప్పారు. వేద కాలం నుంచి గురు-శిష్య అనుబంధం కాలాలకు అతీతంగా కొనసాగుతూనే ఉందని.. తమ విద్యార్థుల ఉన్నతిని చూసి గురువులు పులకించిపోతారన్నారు. నెల్లూరులో తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఇప్పటికీ స్నేహితుల ద్వారా తన యోగక్షేమాల గురించి తెలుసుకుంటుంటారని.. అది తెలిసినప్పుడల్లా మనసు ఆనందంతో నిండిపోతుందని పవన్ అన్నారు.
ఉపాధ్యాయునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి సర్వోన్నతమైన రాష్ట్రపతి పదవి అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకోవడం గురువులందరితోపాటు సర్వేపల్లిని గౌరవించుకున్నట్లే. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పని చేయడం తెలుగువారికి దక్కిన భాగ్యం. వేద కాలం నుంచి భారతదేశంలో గురు-శిష్య అనుబంధం కాలాలకు అతీతంగా కొనసాగుతూనే ఉంది. తమ విద్యార్థుల ఉన్నతిని చూసి గురువులు పులకించిపోతారు. నెల్లూరులో నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల యోగక్షేమాలను.. నా బాల్య స్నేహితుల ద్వారా తెలుసుకుంటుంటానని.. అలా తెలుసుకున్నప్పుడల్లా మనసు ఆనందంతో నిండిపోతుంది. -పవన్ కల్యాణ్, జనసేన అధినేత
-
గురువే జీవిత మార్గదర్శి - JanaSena Chief Shri @PawanKalyan#TeachersDay pic.twitter.com/PRrCi1kHXi
— JanaSena Party (@JanaSenaParty) September 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">గురువే జీవిత మార్గదర్శి - JanaSena Chief Shri @PawanKalyan#TeachersDay pic.twitter.com/PRrCi1kHXi
— JanaSena Party (@JanaSenaParty) September 5, 2022గురువే జీవిత మార్గదర్శి - JanaSena Chief Shri @PawanKalyan#TeachersDay pic.twitter.com/PRrCi1kHXi
— JanaSena Party (@JanaSenaParty) September 5, 2022
ఇవీ చదవండి: