జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం తెదేపా, భాజపాతో విడిపోయాం కాబట్టే వైకాపా బలపడిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన... రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు ఎలా సాధ్యమో ప్రజలకు తెలియజేయాలని నిలదీశారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు. అమరావతి విషయంలో తన అనుమానాలే నిజమయ్యాయని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు ప్రకటన తర్వాత సీఎం విశాఖ వెళ్లినా స్పందన లేదని విమర్శించారు.యువతకు పెద్దపీట
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుభవం ఉన్న వారితో పాటు యువతకు పెద్దపీట వేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. 50 శాతం టిక్కెట్లు వారికే ఇస్తామని స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి రాకపోతే మార్పు రాదని అన్నారు. స్థానిక పోరులో దౌర్జన్యాలు ఉంటాయని... వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి:
'ఈ నెల 20న రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం'