బాలీవుడు నటుడు రిషీకపూర్ మృతిపట్ల నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు.
ఇర్ఫాన్ ఖాన్, రిషీకపూర్ లాంటి నట దిగ్గజాలు హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి విశేష ప్రతిభ, చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను- బాలకృష్ణ
రిషీకపూర్ ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన మృతి భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు. రిషీకపూర్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి - పవన్‌కల్యాణ్
ఇదీ చదవండి..