పర్మిట్ ఫీజు, రోడ్డుపన్ను రద్దు చేసి ట్యాక్సీ యజమానులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. లాక్‌డౌన్ సడలింపు తర్వాత ఉపాధి అవకాశాలు నామమాత్రంగా ఉన్నాయని.. ఈ సమయంలో రవాణాశాఖ ఒత్తిడి భావ్యం కాదన్నారు. నెలాఖరులోగా పన్నులు, రుసుములు చెల్లించాలనడం సరికాదని...సీట్ల కుదింపు ఆంక్షలు ఉన్నంతవరకూ పన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు.
ఇవీ చదవండి: 'ఏయే ప్రాజెక్టులకు ఎంత కేటాయించారో స్పష్టం చేయాలి'