Gramasabha on Amaravathi Capital City Corporation: రాజధాని అమరావతి ప్రాంతాన్ని.. మునిసిపల్ కార్పొరేషన్ గా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై రాజధాని గ్రామాల ప్రజలు నేటి నుంచి గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించనున్నారు. ఈ సభలను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురుగల్లు నుంచి ప్రారంభించారు.
తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామపంచాయతీలు కలిపి.. పురపాలక కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని రాజధాని ప్రాంత రైతులు వ్యతిరేకిస్తున్నారు. అమరావతిని ప్రత్యేక నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలనుకుంటే.. మొత్తం 29 గ్రామాలను కలిపి చేయాలి తప్ప.. కొన్నింటిని వేరే నగరపాలక సంస్థలో కలుపుతామంటే కుదరదని రాజధాని గ్రామాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు ప్రజలంతా కలిసి ఒక తీర్మానం చేసి గ్రామసభల్లో అధికారులకు అందజేసేందుకు సిద్ధమయ్యారు.
ఇదీ చదవండి : Capital amaravathi protest: 750వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం