తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు వీరంగం సృష్టించారు. కొంతమంది విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనవుతున్నారని మిగతావారు ఫిర్యాదు చేయడంతో ఘర్షణకు దారితీసింది. వార్డెన్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతో... విచక్షణ కోల్పోయి తోటి విద్యార్థులపై విరుచుకుపడ్డారు.
విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే ఉన్నప్పటికీ... వారిని నిలువరించేందుకు నానాతంటాలు పడాల్సి వచ్చింది. విద్యార్థులు కొంతకాలంగా చెడు వ్యసనాలకు అలవాటుపడ్డట్టు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తగిన ఆధారాలు కూడా చూపించడం గమనార్హం.
ఇదీ చూడండి:
ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి : నాదెండ్ల