హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లేడీస్ హాస్టల్ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. వసతిగృహాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించారు. పబ్లు, బార్లు, మెట్రో రైళ్లు నడుస్తున్నప్పుడు... కేవలం విద్యావ్యవస్థలు మూసివేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల తమ ఉన్నత విద్య నాశనమవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఓయూలో మూసివేసిన హాస్టళ్లను వెంటనే తెరిపించాలని కోరారు. విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఎన్సీసీ గేటు వద్ద 200 మందితో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తోన్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.