ETV Bharat / city

INTER TEXT BOOKS: ఇంటర్ పాఠ్య పుస్తకాలు లేకుండానే.. విద్యార్థులకు ఆన్​లైన్ తరగతులు

ఇంటర్ పాఠ్య పుస్తకాలు లేకుండానే.. విద్యార్థులకు ఆన్​లైన్ తరగతులు చెబుతున్నారు. దాదాపు 2.50 లక్షల మంది పిల్లలకు పుస్తకాలను అందించాల్సి ఉన్నా... ఈ ఏడాది ప్రింటింగ్​కు ఇవ్వడంలో జాప్యం కారణంగా ముద్రణ పూర్తి కాలేదు.

Online classes for students without inter textbooks
ఇంటర్ పాఠ్య పుస్తకాలు
author img

By

Published : Jul 22, 2021, 9:13 AM IST

ఇంటర్ పాఠ్యపుస్తకాల సరఫరాలో ఈ ఏడాది తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండో ఏడాది విద్యార్థులకు పుస్తకాలు లేకుండానే ఆన్​లైన్ పాఠాలు బోధిస్తున్నారు. పాఠం అర్థం కాకపోతే పునశ్చరణకు పిల్లలకు అవకాశం లేకుండాపోయింది. కొందరు విద్యార్థులు తమ సీనియర్ల వద్ద ఉండే పుస్తకాలను అడిగి తీసుకుంటుండగా.. మిగతావారు అధికారులు ఇచ్చే వాటి కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వ, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలలు , కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలకు ఇంటర్ విద్యాశాఖ ఉచిత పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. దాదాపు 2.50 లక్షల మంది పిల్లలకు పుస్తకాలను అందించాల్సి ఉంది. ఈ ఏడాది ప్రింటింగ్​కు ఇవ్వడంలో జాప్యం జరగడంతో ముద్రణ పూర్తి కాలేదు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యమైనా ఆన్​లైన్ తరగతులు మాత్రం కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:

Rains in Andhra Pradesh: నేడు కోస్తాలో భారీ వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.