ETV Bharat / city

రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. వెయ్యి నగదు: సీఎం జగన్

ఈనెల 31 వరకు రాష్ట్రంలో లాక్​డౌన్​ను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈనెల 29నే రేషన్ సరకులు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.

one thousand cash distributed to ration card holder in ap over caroona affect

author img

By

Published : Mar 22, 2020, 7:58 PM IST

Updated : Mar 22, 2020, 8:25 PM IST

రాష్ట్రంలో లౌక్​డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. రేషన్ కార్డు ఉన్న వారికి కిలో పప్పు ఉచితంగా ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.వెయ్యి అందిస్తామని చెప్పారు. గ్రామ వాలంటీర్లు ఇంటికెళ్లి నగదును అందజేస్తారని పేర్కొన్నారు. ఈనెల 29నే రేషన్ సరకులు అందిస్తామని స్పష్టం చేశారు.

రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రూ. వెయ్యి నగదు: సీఎం జగన్

జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా విజృంభించే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉన్నవాళ్లు వెంటనే 104కు ఫోన్ చేయాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి వచ్చే వారిపై పోలీసులు నిఘా పెట్టాలని ఆదేశించారు. మరోవైపు నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్​ను ఆమోదిస్తామని...అసెంబ్లీని కూడా కొన్ని రోజులపాటే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం:సీఎం

అన్ని రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తేనే కరోనాను అరికట్టగలమన్న సీఎం జగన్....అందరితోపాటు బస్సులు, వాహనాలు నిలిపివేస్తేనే సరైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఇదీ చదవండి:

ఈనెల 31 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దు: సీఎం

Last Updated : Mar 22, 2020, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.