హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్ వాలంతరి రైస్ రీసెర్చ్ సెంటర్ వద్ద చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 2 లేగ దూడలను చంపినట్లు వెల్లడించారు. పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి వారు సమాచారం ఇచ్చారు. గతంలో ఆవు దూడను చంపిన ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మంత్రి కొడాలి నాని పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ