Polavaram: పోలవరం పరిహారం పంపిణీలో అక్రమాల కేసులో నిందితుల సంఖ్య 17కు చేరింది. ఇప్పటికే దేవీపట్నం తహసీల్దారు వీర్రాజును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. తాజాగా బుధవారం ఆర్‌ఐ బాపిరాజు, వీఆర్వో సత్తార్, సర్వేయర్ లక్ష్మణ్‌లను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ కలెక్టర్ మురళి, విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామోజిలను అరెస్టు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రస్తుతం వీరు రంపచోడవరం పోలీసుస్టేషన్‌లో ఉన్నారు. వీరితోపాటు రెవెన్యూ అధికారులు, దళారీలు మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. వీరిలో కొంత మందిని గురువారం కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: