నూతన జిల్లాలకు కలెక్టర్లు, అధికారుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాకు 3 ఐఏఎస్ క్యాడర్ జేసీ పోస్టుల కొనసాగింపుపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. కొత్త జిల్లాలకు అధికారుల కేటాయింపులో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం ఒక్కో జిల్లాకు ముగ్గురు చొప్పున జాయింట్ కలెక్టర్లు ఉండగా.. ఐఏఎస్ అధికారుల కొరతతో ఒక జేసీ పోస్టు రద్దయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత విధానం కొనసాగిస్తే 78 మంది జేసీలు అవసరం పడుతారని అధికారు అంటున్నారు.
ఐఏఎస్ అధికారులను కొత్త జిల్లాలకు నియమిస్తే ఇతర విభాగాల్లో కొరత ఏర్పడి అవకాశం ఉన్నందున నాన్ కేడర్ అధికారులతోనూ జేసీ పోస్టులు భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలకు ఇద్దరు చొప్పున ఐఏఎస్‌లను కేటాయించాలని.. ఈ నేపథ్యంలో కలెక్టర్, జేసీ పోస్టులను ఐఏఎస్‌లతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయింటినట్లు సమాాచారం.