ETV Bharat / city

'వారిని కాలేజీల్లో ఎందుకు చేర్చుకోవట్లేదో చెప్పండి?' - ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటీసుల వార్తలు

పీజీ మెడికల్ కౌన్సెలింగ్​లో సీటు వచ్చిన అభ్యర్ధులను కాలేజీల్లో చేర్చుకోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వీళ్లను ఎందుకు చేర్చుకోవట్లేదో ఈనెల 8వ తేదీలోపు వివరణ తెలపాలన్నారు.

medical seats issue in ap
ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు నోటీసు ఇచ్చిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ
author img

By

Published : Jun 6, 2020, 4:01 AM IST

పీజీ మెడికల్, దంత వైద్య కోర్సుల్లో చేరే అభ్యర్థుల విషయంపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కౌన్సెలింగ్​లో సీటు పొందిన వారిని కాలేజీల్లో చేర్చుకోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వర్శిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వీరిని కాలేజీలో ఎందుకు చేర్చుకోవట్లేదో ఈనెల 8వ తేదీలోపు తెలపాలన్నారు. ఈ అంశాలపై స్పందించని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు షోకాజు నోటీసులిచ్చేందుకు వర్శిటీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

ఈ ఏడాది పీజీ మెడికల్ కౌన్సెలింగ్​లో మొత్తం 14 మెడికల్ కాలేజీల్లో 618 మంది విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు కేటాయించింది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది ఫీజులు తగ్గించిందనే నెపంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ప్రవేశం ఇవ్వలేదు. ఈ నెల 4వ తేదీతో కాలేజీల్లో చేరేందుకు గడువు ముగియడంతో...అభ్యర్థులు 3,4 తేదీల్లో వర్శిటీలో ఆందోళనకు దిగారు. స్పందించిన వర్శిటీ అధికారులు... కాలేజిల్లో అభ్యర్థులు చేరేందుకు ఈ నెల 10 తేదీ వరకు గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

medical seats issue in ap
ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటీసులు

ఇదీ చూడండి: ఇకపై జేసీలకు బల్క్ అనుమతుల అధికారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.