అమరావతి ఉద్యమంలో అసువులు బాసిన పేద రైతులకు ఎన్నారైలు అండగా నిలిచారు. 29 గ్రామాల్లోని 72 మంది పేద రైతు కుటుంబాలకు ఎన్నారై అట్లూరి అశ్విన్ మిత్రబృందం రూ. 15 లక్షలను విరాళంగా అందించారు. ఒక్కో రైతు కుటుంబానికి 20 వేల చొప్పున చెక్కును అందజేశారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్ధండరాయునిపాలెంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. వచ్చే జనవరి నాటికి అమరావతి అంశంపై శుభవార్త వస్తోందని శోభనాద్రీశ్వరరావు అన్నారు.
కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి, రాజధాని ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్, మహిళా ఐకాస నేత పద్మశ్రీ తదితరలు పాల్గొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అమరావతి ఉద్యమంలో అమరులైన రైతులకు నివాళలర్పించారు. రైతుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఇదీ చదవండి: