డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, అటానమస్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు గానూ ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. అడ్మిషన్ ప్రక్రియ అనంతరం అక్టోబరు 1వ తేదీ నుంచి తరగతులు కూడా నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యా మండలి తెలిపింది.
బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను జారీ చేసినట్టు ప్రకటన విడుదల చేసింది. మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబరు 17వ తేదీలోగా పూర్తి చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజస్ oamdc.ap.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది. దివ్యాంగులు, ఎన్సీసీ, క్రీడలు, స్పోర్ట్స్ తదితర విభాగాలకు చెందిన వారికి ప్రత్యేక కోటాలో అడ్మిషన్లను ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలోని ఎస్ఆర్ఆర్, విశాఖలోని వీఎస్ కృష్ణా కాలేజి, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చేపట్టనున్నట్టు తెలియజేసింది.
ఇదీ చదవండి: Transfers: డిగ్రీ కళాశాల లెక్చరర్ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి