ETV Bharat / city

పూర్తైన తొలి ఘట్టం.. పోరుకు దగ్గరపడుతున్న సమయం - ap panchayth elections nominations latest news

రాష్ట్రంలో తొలి దఫా పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. పలు జిల్లాలో అభ్యర్థులు పెద్దఎత్తున నామపత్రాలు దాఖలు చేయగా.. కొన్ని జిల్లాలో ఆశించిన స్థాయిలో దాఖలు చేయలేదు. 3,251 పంచాయతీలు 32,522 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. వీటిలో ఎక్కువ శాతం పంచాయతీల్లో పోటీ ఎక్కువగానే ఉంది. దాఖలైన నామినేషన్ల పరిశీలనను అధికారులు ఇవాళ పూర్తి చేశారు..ఈనెల 4 న సాయంత్రం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.

పూర్తైన నామినేషన్లు
పూర్తైన నామినేషన్లు
author img

By

Published : Feb 1, 2021, 8:30 PM IST

రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం పెద్దఎత్తున అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. తొలి దఫాలో విజయనగరం మినహా 12 జిల్లాలో 18 రెవెన్యూ డివిజన్లు, 173 మండలాల్లో ఎన్నికలు జరగనుండగా.. వీటికి జనవరి 29 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించారు. 3,251 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుండగా.. 19,491 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

చిత్తూరులో అధికంగా..

చిత్తూరు జిల్లాలో454 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా.. అత్యధికంగా 2890 మంది నామపత్రాలు దాఖలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 366 గ్రామ పంచాయతీలుండగా.. 2135 నామ పత్రాలు దాఖలు చేశారు. విశాఖపట్నం జిల్లాలో 340 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా.. 2009 నామినేషన్లు దాఖలయ్యాయి. గుంటూరు జిల్లాలో 1745, శ్రీకాకుళం జిల్లా 1772, పశ్చిమ గోదావరి జిల్లాలో 1415, కృష్ణా జిల్లాలో 1379, ప్రకాశంలో 1372, కడప జిల్లాలో 1477, కర్నూలు జిల్లాలో 1243, అనంతపురం జిల్లాలో 1095 నామినేషన్లు దాఖలయ్యాయి. నెల్లూరు జిల్లాలో 163 పంచాయితీల్లో ఎన్నికలు జరుగుతుండగా 959 మందే నామినేషన్లు వేశారు.

అనంతపురంలో తక్కువే..

రాష్ట్రంలో విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో 32,522 వార్డుల్లో తొలిదఫా ఎన్నికలు జరుగుతుండగా.. వార్డు సభ్యుల ఎంపిక కోసం నామినేషన్లు స్వీకరించారు. మూడు రోజుల్లో కలిపి మొత్తం 79,799 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లాలో 4100 వార్డుల్లో తొలిదఫా ఎన్నికలు జరుగుతుండగా.. వీటిలో 12,913 మంది నామపత్రాలు దాఖలు చేశారు. విశాఖపట్నం జిల్లాలో 3250 వార్డులుండగా 9525 మంది నామినేషన్లు వేశారు. గుంటూరు జిల్లాలో 3442 వార్డుల్లో 8019 మంది పోటీ పడుతున్నారు. కృష్ణా - 7889, చిత్తూరు - 6821, పశ్చిమగోదావరి జిల్లాలో 6639, శ్రీకాకుళం -6382 , ప్రకాశం -5923 , కర్నూలు -4420, కడప- 4265, నెల్లూరు -3923, అనంతపురం జిల్లాలో 3080 నామపత్రాలు దాఖలయ్యాయి.

మంచి ముహూర్తం కలసి వస్తుందా..?

మూడు రోజుల్లో తొలి రోజు ఆశించినంతగా అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయలేదు. రెండో రోజు ఓ మోస్తరుగా నమోదవగా.. మూడో రోజున భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. పంచాయతీల్లో తొలిరోజున 1313 దాఖలుకాగా.. రెండో రోజున 7,463, మూడో రోజన 10,715 మంది నామపత్రాలు అందించారు. వార్డుల్లో మొదటి రోజు 2,201 మందే నామపత్రాలు అందించగా.. రెండో రోజున 23,342 మంది, చివరి రోజున 54,256 మంది నామపత్రాలు దాఖలు చేశారు. మంచి ముహూర్తం ఉండటంతో చాలా మంది చివరి రోజున నామపత్రాలు అధికారులకు అందించడం విశేషం.

అన్ని చోట్ల దాఖలైన నామపత్రాలను స్థానిక అధికారులు పరిశీలించారు. రేపు, ఎల్లుండి స్థానిక రెవెన్యూ డివిజన్లలో అధికారులు అప్పీళ్లను స్వీకరించి పరిష్కరిస్తారు. ఈ నెల 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. అనంతరం పంచాయతీలు, వార్డుల వారీగా బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను స్థానిక రిటర్నింగ్ అధికారులు వెల్లడించనున్నారు. ఈ నెల 9న తొలి దఫా పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది.

ఇదీ చదవండి: ఏకగ్రీవాలపై వైకాపా ఆశలు నీరుగారాయి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.