ETV Bharat / city

'పరిధితో సంబంధం లేదు... పక్కాగా అమలు చేయాల్సిందే' - జీరో ఎఫ్​ఐఆర్ వార్తలు

పోలీస్‌ స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు నమోదు చేసేందుకు ఆస్కారం కల్పించే  జీరో ఎఫ్​ఐఆర్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని  డీజీపీ గౌతం సవాంగ్‌ నిర్ణయించారు. దీనికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను వారంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి పోలీసులకు అవగాహన పెంచనున్నారు.

'పరిధితో సంబంధం లేదు... జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేయాల్సిందే'

author img

By

Published : Dec 3, 2019, 5:03 AM IST

Updated : Dec 3, 2019, 11:06 AM IST

జీరో ఎఫ్​ఐఆర్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్‌ నిర్ణయించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు నమోదు చేసేందుకు ఆస్కారం కల్పించాలన్నారు.

2016లో దిల్లీలో నిర్భయ ఘటన అనంతరం జస్టిస్‌ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా సీఆర్​పీసీ చట్టానికి సవరణలు చేశారు. దేశవ్యాప్తంగా జీరో ఎఫ్​ఐఆర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆపదలో ఉన్నవారిని వెంటనే ఆదుకునేందుకు ఈ జీరో ఎఫ్​ఐఆర్ ఉపయోగపడుతుందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. పోలీస్‌స్టేషన్‌ పరిధితో పనిలేకుండా ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకుని తీవ్రతను బట్టి చర్యలు తక్షణమే తీసుకునేలా ఈ విధానం ఉంటుందన్నారు. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని చెప్పారు.

మరోవైపు గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల శిక్షణాధికారులకు కార్యశాలను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ప్రారంభించారు. రాష్ట్రంలో 14వేల 967 గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఈ నెల 9 నుంచి తరగతులు ప్రారంభిస్తామనన్నారు. తొలుత వారికి శిక్షణనిచ్చే అధికారులకు కార్యశాల నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో మహిళల భద్రతతో పాటు, మహిళలు, బాలికల కోసం అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాల పట్ల అవగాహన పెంచడమే వీరి విధి అని వివరించారు.

వీరి నియామకం వల్ల గ్రామాల్లో తమ సమస్యలను చెప్పుకునేందుకు మహిళలు ఇకపై ముందుకు వస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

'పరిధితో సంబంధం లేదు... జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేయాల్సిందే'

ఇదీచదవండి

వంతెనే ఆవాసం... అదే లేకుంటే బతుకు భారం

sample description
Last Updated : Dec 3, 2019, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.