రాష్ట్రంలో నిన్నటివరకు 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కర్నూలులో 75, గుంటూరు జిల్లాలో 49, నెల్లూరు జిల్లాలో 48 , కృష్ణా జిల్లాలో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలో 27 , పశ్చిమ గోదావరి జిల్లాలో 22, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో 20 పాజిటివ్ కేసులు చొప్పున నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 11 కేసులు నిర్థారించారు .ఇప్పటివరకూ నలుగురు మృతి చెందగా..9 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. అయితే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకూ 217 నమూనాలు పరీక్షించగా అన్నీ నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదని తెలిపారు.
ఇవీ చదవండి: కరోనా కాలంలో వృద్ధులు జరభద్రం