ETV Bharat / city

TG INTER BOARD: తెలంగాణలో మొదటి సంవత్సరం పాఠాల ఊసెత్తని ఇంటర్‌ విద్యాశాఖ - ఇంటర్​ మొదటి సంవత్సరం వార్తలు

కరోనాతో ప్రపంచమే మారిపోయింది. విద్యార్థుల చదువు అయితే అటకెక్కింది. ఆన్​లైన తరగతులు నిర్వహిస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. ఈ సంవత్సరం కూడా కళాశాల ప్రారంభం స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే ఆన్​లైన్​ తరగతులు నిర్వహిస్తామని చెబుతున్న ఇంటర్​ బోర్డు.. తొలి ఏడాదికి మాత్రం ఇప్పటివరకు తరగతులు ప్రారంభించకపోవడం గమనార్హం.

inter-first-year-
inter-first-year-
author img

By

Published : Aug 1, 2021, 9:27 AM IST

తెలంగాణలో ఇంటర్​ మొదటి సంవత్సరం ఆన్​లైన్​ తరగతులపై స్పష్టత లేకపోవటంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ప్రవేశాల సంఖ్యను పెంచుకునేందుకు కాంట్రాక్టు అధ్యాపకులను గ్రామాల్లో పర్యటింపచేస్తున్న ఇంటర్‌ విద్యాశాఖ.. ప్రథమ సంవత్సరం తరగతుల ప్రారంభాన్ని మరిచిపోయింది. జులై ఒకటో తేదీ నుంచి రెండో ఏడాది విద్యార్థులకు ఆన్‌లైన్‌, టీవీ పాఠాలను మొదలుపెట్టిన ఆ శాఖ అధికారులు.. తొలి ఏడాదికి మాత్రం ఇప్పటివరకు ప్రారంభించకపోవడం గమనార్హం. రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల గడువు శనివారంతో ముగియగా దాన్ని ఆగస్టు 17 వరకు పెంచుతూ ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 402 ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటివరకు దాదాపు 93 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

ప్రవేశాల గడిగించిన ఇంటర్​ బోర్డు

తాజాగా ప్రవేశాల గడువును ఇంటర్‌ బోర్డు పొడిగించిందే తప్ప టీవీ పాఠాలెప్పుడో వెల్లడించకపోవడం గమనార్హం. మే 25 నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. అంటే రెండు నెలలు దాటింది. ఇంకెప్పుడు పాఠాలు మొదలవుతాయా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రైవేట్‌ కళాశాలల్లో 30 శాతం, కార్పొరేట్‌ కళాశాలల్లో ఇప్పటివరకు 50 శాతం సిలబస్‌ పూర్తయిందని హైదరాబాద్‌లోని కళాశాలల నిర్వాహకుడు ఒకరు తెలిపారు. ఆన్‌లైన్‌ పాఠాల ద్వారా కొంతవరకైనా అర్థమైతే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాక మళ్లీ పాఠాలు బోధిస్తే సులభంగా గ్రహించగలుగుతారని నిపుణులు అంటున్నారు.

అనుబంధ గుర్తింపు నాలుగో వంతు కళాశాలలకే

రాష్ట్రవ్యాప్తంగా 1,521 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి. వాటిల్లో జులై 31వ తేదీ రాత్రి 7.30 గంటల వరకు 376 కళాశాలలకే అనుబంధ గుర్తింపు జారీ చేశారు. ఆ కళాశాలల జాబితాను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్లో ఉంచారు. రెండు వారాల క్రితం(జులై 17న) అనుబంధ గుర్తింపుపై ఇంటర్‌ బోర్డు జేడీని వివరణ కోరగా ప్రక్రియ ప్రారంభించామని, కొద్దిరోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఆనాడు 30 కళాశాలల జాబితాను వెబ్‌సైట్లో ఉంచగా ఇప్పుడు వాటి సంఖ్య 376కి మాత్రమే పెరిగింది. వ్యాపార సముదాయాల్లో కొనసాగుతున్న 426 కళాశాలలకు అగ్నిమాపక శాఖ నుంచి మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు అవసరం. వాటిని పక్కన పెట్టినా ఇంకా 719 కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ చేయాల్సి ఉంది. వాటికి ఇంటర్‌బోర్డు అనుమతి నిరాకరిస్తే ఆ కళాశాలల్లో చేరిన విద్యార్థుల భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ చదవండి: స్నేహానికి సరికొత్త భాష్యం చెప్పిన సినిమాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.