ETV Bharat / city

Polavaram: త్వరలో పోలవరానికి ఎన్‌హెచ్‌పీసీ బృందం.. నేడు, రేపు కేంద్ర కమిటీ పరిశీలన - పోలవరానికి ఎన్‌హెచ్‌పీసీ బృందం రాక వార్తలు

Polavaram: పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ సామర్థ్యం ఎలా ఉందో పరిశీలించేందుకు ఎన్‌హెచ్‌పీసీ అంగీకరించింది. త్వరలోనే ఆ బృంద సభ్యులు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.

nhpc team to visit polavaram
త్వరలో పోలవరానికి ఎన్‌హెచ్‌పీసీ బృందం
author img

By

Published : Jun 18, 2022, 9:37 AM IST

Polavaram: పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ సామర్థ్యం ఎలా ఉందో పరిశీలించేందుకు నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) అంగీకరించింది. త్వరలోనే ఆ బృంద సభ్యులు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. గతంలో భారీ వరదలకు డయాఫ్రం వాల్‌ కొంతమేర ధ్వంసమైనట్లు బయటకు కనిపిస్తున్నా.. నదీగర్భంలో దాని సామర్థ్యం ఎలా ఉందో తేల్చాలని కేంద్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జాతీయ జలవిద్యుత్తు సంస్థకు ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు.

రాష్ట్ర జలవనరులశాఖ ఉన్నతాధికారులు లేఖ రాయగా వారు వచ్చి పరిశీలించేందుకు అంగీకరించారు. ఈలోపు పోలవరం ప్రాజెక్టును గతంలో కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ శని, ఆదివారాల్లో సందర్శించనుంది. ఈ కమిటీలో కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్లు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును ఈ కమిటీ సందర్శించడం ఇది ఏడోసారి. ప్రాజెక్టు పురోగతితో పాటు, అంచనా వ్యయాలు, తొలిదశ అంచనాలను కొలిక్కి తెచ్చేందుకు వీలుగా వీరు పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.

ఈ కమిటీ పర్యటన సందర్భంగా మరికొందరు నిపుణులనూ ఆహ్వానించారు. కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్‌ పాండా, ఎన్‌హెచ్‌పీసీ విశ్రాంత డైరక్టర్‌ డి.పి.భార్గవ, కేంద్ర జలసంఘం విశ్రాంత సభ్యులు డి.వి.తరేజా కూడా పోలవరం రానున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.